చిత్తూరు జిల్లా పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని.. కేవలం 3000 కోట్ల రూపాయలే నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు.
READ MORE: China: మాజీ ప్రియురాలిని మరిచిపోవడానికి యువకుడికి వింత ఆలోచన! 6 రోజులు ఏం చేశాడంటే..!
సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు ప్రజలకు చీటింగ్ చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
“మహిళలకు ఉచిత బస్సు పథకం జిల్లాలకు మాత్రమే అమలు చేస్తానని చంద్రబాబు అంటున్నారు. ఉచిత బస్సు పథకం శ్రీకాకుళం నుంచి కుప్పం వరకుఅమలు చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లాలి.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Pakistan: భారత్ అంటే తెలిసొచ్చింది.. ‘‘అణు బెదిరింపుల’’పై వెనక్కి తగ్గిన పాకిస్తాన్..
