Site icon NTV Telugu

Peddireddy vs Nallari: మరోసారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దిరెడ్డి హాట్‌ కామెంట్లు..

Peddireddy

Peddireddy

Peddireddy vs Nallari: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా కాళ్లు పట్టుకున్న పంచాయితీ ఇద్దరు నేతల మధ్య కాకరేపుతోంది.. పెద్దిరెడ్డి నా కళ్లు పట్టుకున్నాడు.. రాత్రి కళ్లు పట్టుకున్న ఆయన.. మరుసటి రోజు ఉదయం వచ్చి మరోసారి కాళ్లు పట్టుకున్నాడు.. తనకు పదవి ఇప్పించాలంటూ.. అని కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇక, కిరణ్ కుమార్ రెడ్డి.. అప్పట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారని విమర్శిస్తూ వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి.. అవే కామెంట్లు మళ్లీ రిపీట్‌ చేశారు.. రాష్ట్ర విభజనకు సహకారం, వైఎస్‌ జగన్ ను అడ్డుకుంటా అని చెప్పి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు..

Read Also: Shaitaan OTT : ఓటీటీలోకి ఆలస్యంగా రాబోతున్న హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ?

ఇక, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి.. నమ్మి కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ ను చేస్తే.. వైఎస్‌ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి, వైఎస్ జగన్ ను 16 నెలలు జైలులో పెట్టారంటూ ఫైర్‌ అయ్యారు పెద్దిరెడ్డి.. ఇక, తమ్ముళ్ళను పెట్టుకుని హైదారాబాద్ లో ఆఫీస్‌ ఓపెన్ చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. తర్వాత చెప్పుల పార్టీ పెట్టుకుని సొంత తమ్ముడిని కూడా గెలిపించుకులేక పోయారంటూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version