NTV Telugu Site icon

Peddireddy vs Kiran Kumar Reddy: ఆగని మాటల యుద్ధం.. మాజీ సీఎం కిరణ్‌పై పెద్దిరెడ్డి ఫైర్‌..

Peddireddy

Peddireddy

Peddireddy vs Kiran Kumar Reddy: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్‌ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నాను అని అబద్ధాలు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు.. అయన మరణం అనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

Read Also: Kejriwal: ఇన్సులిన్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు ఏం తేల్చిందంటే..!

ఇక, వైఎస్ జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా ? అని ప్రశ్నించారు పెద్దిరెడ్డి.. వైఎస్‌ జగన్ ను అరెస్ట్ చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకున్నారు.. చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని విమర్శించారు. మరోవైపు.. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే 10 రోజులపాటు అయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచారు.. ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పి అక్కడ సంపద దోచుకుంది నిజం కాదా ? అని నిలదీశారు. నేను పుట్టింది తెలంగాణలో, నేను కూడా తెలంగాణ వాడినే అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు.. ఆఖరి బాల్ నాదే అని చెప్పి ఏపీ ప్రజల్ని మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి.. వాళ్ల సొంత తమ్ముడే ఆయన్ని ఇక్కడ నుండి తరిమేశారు.. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి, నేడు బీజేపీ టికెట్‌పై పోటీ చేయడానికి సిగ్గు ఉండాలి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి మెడలో చెప్పులు వేసుకుని తిరిగాడు.. ఇలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇక, నాకు ఒక ఓటు తగ్గినా పర్లేదు.. కానీ, ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.