ఇన్సులిన్ అందించాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. కేజ్రీవాల్ న్యాయవాదులు.. ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, రమేష్ గుప్తా వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును న్యాయస్థానం సోమవారానికి రిజర్వ్ చేసింది. తీవ్రమైన మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించేందుకు.. అలాగే ఇన్సులిన్‌ను ఎక్కించేందుకు జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారించిన ధర్మాసనం.. పిటిషన్‌పై ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
ఇది కూడా చదవండి: Gaddam Vamshi Krishna: గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..
డైట్ చార్ట్ ప్రకారమే కేజ్రీవాల్‌కు ఫుడ్ అనుమతి ఇస్తున్నట్లు జైలు తరపు లాయర్ వాదనలు వినిపించారు. షుగర్ లెవెల్స్ జైలు డాక్టర్లు ఎప్పటికప్పడు మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. షుగర్ లెవెల్స్ మెయింటెన్స్ అవుతున్నాయని వెల్లడించారు. ఎయిమ్స్ నివేదిక ప్రకారం మ్యాంగో, బనానాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలు షుగర్ ఉన్నవారు తీసుకోవద్దని జైలు తరపు లాయర్ పేర్కొన్నారు. అవసరం అయితే జైల్లో ఇన్సులిన్ కూడా ఇస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పదేళ్లు ఏమీ చేయని బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఎందుకు ఓటేయాలి..?
ఇదిలా ఉంటే ఇదే అంశంపై గురువారం కూడా ఈడీ తరపు పలు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ జైల్లో మామిడి పండ్లు, తీపి పదార్థాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మెడికల్ బెయిల్ పొందేందుకే ఇలా చేస్తున్నారని ఈడీ తెలిపింది. అయితే ఈడీ ఆరోపణలను ఆప్ ఖండించింది. ప్రధాని మోడీ ఆదేశాలతో కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో చంపేందుకు కుట్ర చేస్తు్న్నారని ఆరోపించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుల్లో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీ విధించగా తీహార్ జైలుకు తరలించారు. ఇక బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టు తీసిపుచ్చాయి. తాజాగా ఇన్సులిన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరగా.. తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.
ఇది కూడా చదవండి: Ex MP Ravindra Naik: కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్