Peddireddy vs Kiran Kumar Reddy: ఆగని మాటల యుద్ధం.. మాజీ సీఎం కిరణ్‌పై పెద్దిరెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy vs Kiran Kumar Reddy: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నాను అని అబద్ధాలు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు.. అయన మరణం అనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
Read Also: Kejriwal: ఇన్సులిన్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు ఏం తేల్చిందంటే..!
Also Read
ఇక, వైఎస్ జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా ? అని ప్రశ్నించారు పెద్దిరెడ్డి.. వైఎస్ జగన్ ను అరెస్ట్ చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకున్నారు.. చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని విమర్శించారు. మరోవైపు.. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే 10 రోజులపాటు అయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచారు.. ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పి అక్కడ సంపద దోచుకుంది నిజం కాదా ? అని నిలదీశారు. నేను పుట్టింది తెలంగాణలో, నేను కూడా తెలంగాణ వాడినే అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు.. ఆఖరి బాల్ నాదే అని చెప్పి ఏపీ ప్రజల్ని మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి.. వాళ్ల సొంత తమ్ముడే ఆయన్ని ఇక్కడ నుండి తరిమేశారు.. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి, నేడు బీజేపీ టికెట్‌పై పోటీ చేయడానికి సిగ్గు ఉండాలి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి మెడలో చెప్పులు వేసుకుని తిరిగాడు.. ఇలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇక, నాకు ఒక ఓటు తగ్గినా పర్లేదు.. కానీ, ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!