Site icon NTV Telugu

Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్‌ హయాంలో రైతులు ఏనాడు నీళ్లు రావటం లేదని అడిగిన దాఖలాలు లేవు

Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy

వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ రైతులందరు యాసంగి పంట కోసం గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో మూడు, నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యుట్ ప్లాన్ ప్రాకారం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు పంటలకు నీరందించామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకమైన ఏజన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక ద్వారా సాగుకు గోదావరి నీళ్లను తీసుకువచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో లాగా రైతులకు సాగు నీళ్లు వస్తాయ రావా అని ఆందోళన చెందుతున్నారు రైతులు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్కసారైనా అధికారులతో సమీక్షించారా అని ఆయన ప్రశ్నించారు. గతంలో పూడుకుపోయిన కాలువలకు పూడిక తీసి సమృద్ధిగా నీళ్లు కాలువల ద్వారా పారించామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సరిపోను నీళ్లు అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏనాడు నీళ్లు రావటంలేదని అడిగిన దాఖలాలు లేవని, పాఖాల గోదావరి జలాల ప్రాజెక్టు బూటకమన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా.. ‘ఈరోజు దేనిని బేస్ చేసుకుని తైబంది ఇస్తామని అంటున్నారో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి. ప్రాజెక్టుల్లో నీటి నిలువలు ఉన్నా ఇప్పుడు ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీళ్లు ఎందుకు రావటంలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. నియోజకవర్గంలో డీబీఎం 38, 40 ద్వారా 50 వేల ఎకరాల పై చీలుకు పంటలు సాగులో ఉండేవి. ఈ రోజు ఆ కాలువల ద్వారా నీరు ఎందుకు రావటం లేదు. బోర్లు, బావులు ఉన్న రైతులు కాలువ ద్వారా వచ్చే నీళ్లు వాడొద్దని అంటున్నారు ఎందుకు. పాఖాలకు నీళ్లు తీసుకువస్తే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటామన్న నాయకులు ఈరోజు ఎక్కడికి వెళ్లారు. తైబంది నిర్ణయించిన అధికారులు తక్షణమే స్పందించి బాధ్యత వహించి రైతులకు సమాధానం చెప్పాలి.
‘ అని పెద్ది సుదర్శన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version