Exclusive : పెద్ది పోస్ట్ పోన్.. ఓటీటీ డీల్ పై కోత పెట్టిన నెట్ ఫ్లిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది‘ సినిమా విడుదల గురించే చర్చ జరుగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమని తెలుస్తోంది. ఈ ఆలస్యం కేవలం అభిమానులను నిరాశపరచడమే కాకుండా నిర్మాతలకు భారీ ఆర్థిక భారంగా మారేలా కనిపిస్తోంది.
Also Read : Tollywood Summer Releases 2026 : సమ్మర్ అన్ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్ ఇచ్చేశారా?
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
సాధారణంగా పెద్ద సినిమాల డిజిటల్ రైట్స్ ఒప్పందాల్లో రిలీజ్ డేట్ అనేది అత్యంత కీలకం. ‘పెద్ది’ సినిమా విషయంలో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కీలక నిబంధన విదించింది. ఒకవేళ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాకపోతే ఒప్పందం కుదుర్చుకున్న మొత్తంలో 30 శాతం కోత విధిస్తామని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంటే సినిమా ఆలస్యమైతే నిర్మాత కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ కఠిన నిబంధనకు నిర్మాత మొదట అంగీకరించలేదని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని నిర్మాత భావించారని ఇన్ సైడ్ టాక్. కానీ కంటెంట్ రెడీ కాకపోవడం ఇంకా సాంగ్ పెండింగ్, ఆర్ ఆర్ వర్క్ ఉండడంతో చేసేదేమీ లేక వాయిదా వేయాల్సి వస్తోంది. ఏడాది క్రితమే విడుదల తేదీని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ షూటింగ్ పనులు పూర్తి కాలేదు. షూటింగ్ పూర్తి కాకుండా కంటెంట్ సిద్ధం కాకుండా నిర్మాత మాత్రం ఏం చేయగలరు. టాలీవుడ్లో ఇప్పుడు ఇదొక ట్రెండ్‌గా మారింది. షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ రిలీజ్ డేట్లను లాక్ చేయడం వల్ల నిర్మాతలు ఇబ్బందుల్లో పడుతున్నారు. ‘పెద్ది’ విషయంలో కూడా అదే జరిగింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా చేతిలో పూర్తి స్థాయి అవుట్‌పుట్ లేకపోవడంతో, అటు ఓటీటీ డీల్‌ను కాపాడుకోలేక, ఇటు అభిమానులకు సమాధానం చెప్పలేక నిర్మాతలు సందిగ్దనికి లోనవుతున్నారు. రిలీజ్ వాయిదా వేయడంతో పెద్ది ఓటీటీ నుండి కోల్పోయిన ఆదాయాన్ని థియేటర్ నుండి రాబట్టాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!