Tollywood Summer Releases 2026 : సమ్మర్ అన్ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్ ఇచ్చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సమ్మర్ అంటే ఒకప్పుడు కాసుల వర్షం. విద్యార్థులకు సెలవులు, కుటుంబీకులకు వినోదం.. వెరసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగేది. కానీ గత రెండేళ్లుగా టాలీవుడ్ ధోరణి చూస్తుంటే ‘సమ్మర్ సీజన్’ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతుండటంతో నిర్మాతలు సమ్మర్ హాలిడేస్‌ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ‘పెద్ది‘ సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు నెల రోజుల ముందే ఓవర్సీస్ బుకింగ్స్ జోరుగా సాగుతాయి. కానీ ‘పెద్ది’ విషయంలో ఇప్పటికీ ఎక్కడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ప్రమోషన్లలో వేగం లేకపోవడం సినిమా వాయిదా పడిందనే వార్తలకు బలం చేకూరుస్తోంది. దీనివల్ల ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లు కళ తప్పే అవకాశం ఉంది.
ఈ ఏడాది వేసవి బరిలో నిలిచిన ఏకైక బిగ్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ నష్టాలను మిగిల్చిన ఈ సినిమా ఫలితం ఇండస్ట్రీని నిరాశకు గురిచేసింది. ఇక మెగా హీరోలు సైతం సమ్మర్‌కు వస్తామని చెప్పి చివరి నిమిషంలో చేతులెత్తేయడం గమనార్హం. అటు పెద్ది వాయిదా వేస్తె ఇటు చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ కూడా వాయిదా పడటంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అటు నిఖిల్ నటించిన స్వయంభు కూడా ఏప్రిల్ రిలీజ్ వాయిదా వేసుకుని మే లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒకప్పుడు సమ్మర్ అంటే పోటీ పడి రిలీజ్ చేసే నిర్మాతలు 2023 నుండి సమ్మర్ లో సినిమాలు రిలీజ్ వాయిదా వేయడమే మేలని భావిస్తున్నారు. సినిమాలకు అసలైన సీజన్ సమ్మర్ అయినప్పటికీ ప్రస్తుతం IPL (Indian Premier League) మేనియా స్టార్ హీరోలను ఆలోచనలో పడేస్తోంది. సాయంత్రం వేళల్లో ప్రేక్షకులు ఐపీఎల్ మ్యాచ్‌లకు కట్టుబడిపోతుండటంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే భయం నిర్మాతల్లో కనిపిస్తోంది. అందుకే సమ్మర్ ఇప్పుడు అన్-సీజన్‌గా మారిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!