PEDDI Movie Second Single: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పాటకు ఎక్కడ చూసినా అద్భుతమైన స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ ఫస్ట్ సాంగ్‌తోనే మరో సిక్స్ కొట్టాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ దాటింది. ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయి వ్యూస్ రావడం చరణ్ అభిమానులకు పండుగలా మారింది. ఈ సాంగ్ ఇప్పుడు రీల్స్‌లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రత్యేకంగా చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాను పూర్తిగా రూల్ చేస్తోంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ పాటకు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ అందించారు. ఆయన ఇచ్చిన ఎనర్జిటిక్ ట్యూన్‌కు చరణ్ వేసిన మాస్ స్టెప్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.
Hyderabad: రెడ్ లైట్ ఏరియాగా మారిన శ్రీశైలం హైవే? పట్టించుకోని పోలీసులు..!
‘ఉప్పెన’తో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు సానా.. ఈ సారి మరింత భారీ ఎత్తున సినిమా రూపొందిస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ మాస్ స్ట్రీట్ సాంగ్ అభిమానులలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. దీనితో ఇంకా మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా యూనిట్ త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం ఈ పాటను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా లేదా డిసెంబర్ చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా 2026 మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Kidney Racket: కిడ్నీ రాకెట్ వ్యవహారం.. గ్లోబల్ ఆస్పత్రి సీజ్, పలువురి అరెస్ట్..!
