ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలబెట్టిన తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం, అంబడిపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లలో గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం అందడంతో గ్రామస్థులు ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు చల్లుతూ జేజేలు పలికారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. 2019లో తాను వచ్చే నాటికి రోడ్లు దీనావస్థలో ఉంటే.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో అన్ని రోడ్లు బాగు చేశామన్నారు. అమరావతి – బెల్లంకొండ రోడ్డు 149 కోట్లతో పూర్తి చేస్తున్నామన్నారు.
Read Also: Vizag Capital: మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పాలన
అలాగే, కృష్ణానదిపై బ్రిడ్జి కూడా టెండర్ పూర్తైందని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కాబట్టే ఇప్పుడు ధైర్యంగా ఓట్లు అడుగుతున్నానన్నారు. టీడీపీ నేతలు ఏం అభివృద్ధి చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. గ్రామస్థులు కూడా కులం, మతం, పార్టీలు చూడకుండా మంచి చేసిన వారిని గుర్తించి ఓట్లు వేయాలని సూచించారు. అప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలో సుమారు 83 కోట్ల రూపాయలతో స్కూళ్లు బాగు చేశామన్నారు. 27 కోట్లతో హస్పటల్స్ బాగు చేశామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకరరావు అన్నారు.
Read Also: Hemant Soren: హేమంత్ సోరెన్‌కు చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ
ఇక, టీడీపీ హయాంలో ఒక్క ఆస్పత్రి బాగు చేశారా అని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు ప్రశ్నించారు .2014లో పొత్తులు, బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. మళ్లీ అదే కుట్ర మార్గంలో వస్తున్నారన్నారు. అలాంటి వారికి ఓటు వేస్తే.. పెత్తందార్ల పాలనతో పేదలు ఇబ్బందులు పడతారన్నారు. పేదల పక్షాన నిలబడి మేలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం చూసి మరోసారి తనను, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు కోరారు.