PDS Ration Scam: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు!
- రేషన్ బియ్యం అక్రమ వ్యవహారం
- పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు
- అజ్ఞాతంలోకి పేర్ని నాని సతీమణి జయసుధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు.
గత రెండు నెలలుగా రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారం ఏపీ రాష్ట్రమంతా మారుమోగుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో రేషన్ మాఫియా వేళ్లూనుకుందని.. కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు. దాంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి.. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు పేర్ని నాని లేఖ రాశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది.
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
రేషన్ బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందించారు. రేషన్ బియ్యం తగ్గుదలపై మరోసారి అధికారులు గోదాములలో విచారణ చేయనున్నారు. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని పిటీషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు పేర్ని నాని తన సతీమణిని అజ్ఞాతంలోనే ఉంచారు.
తాజావార్తలు
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!