Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pcc Chief Mahesh Kumar Goud Participated In The Self Esteem Meeting Of Rmp And Pmp Rural Doctors

PCC Chief: కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. పదేళ్ళు ప్రాథమిక వైద్యాన్ని మంటగలిపారు

Published Date :February 18, 2025 , 3:21 pm
By Rajesh Veeramalla
  • ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ
  • హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం
  • కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం- మహేష్ కుమార్ గౌడ్
  • అన్ని హామీలను నెరవేర్చడంలో ముందుంటాం- మహేష్ కుమార్ గౌడ్
  • పదేళ్ళు ప్రాధమిక వైద్యాన్ని బీఆర్ఎస్ మంటగలిపింది- మహేష్ కుమార్ గౌడ్.
PCC Chief: కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. పదేళ్ళు ప్రాథమిక వైద్యాన్ని మంటగలిపారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో 14 వేల మందికి శిక్షణ ఇచ్చారు.. ఇంకా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ.. ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా ఉన్న తమకు ప్రభుత్వ గుర్తింపు కావాలంటూ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ సభకు వెళ్లాలని ఉదయానే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడితే సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Read Also: Pushpa 2 : పుష్ప- 2 లేటెస్ట్ కలెక్షన్స్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్

తనకు చిన్నప్పుడు గాయమైతే ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేశారు.. అప్పుడు వైద్య సిబ్బంది లేరని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను నెరవేర్చడంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. 2008లో ప్రజల మనిషిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీల కోసం అప్పుడు జీవో తీసుకొచ్చారని అన్నారు. కొంతమంది వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయడం వల్ల వైద్యం వికటించి చనిపోతున్నారు అలాంటివి అరికట్టాలని తెలిపారు. మరోవైపు.. పదేళ్ళు ప్రాధమిక వైద్యాన్ని బీఆర్ఎస్ మంటగలిపిందని ఆరోపించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తున్నాం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Read Also: Summer: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో..!

పదేళ్లపాటు కనీసం బాధలను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.. తప్పకుండా సీఎం రేవంత్, తాను, కోదండరాం.. అందరం కలిసి చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. లక్షల వేలకోట్ల అప్పులతో వాటికి వడ్డీలు కట్టుకుంటూ.. రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వం పనిచేస్తున్నామని అన్నారు. కుల సర్వే చేశాం.. భారతదేశంలో ఎక్కడ జరగలేదు, తెలంగాణలో జరిగిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందని అభిప్రాయపడ్డారు. మంచి పని చేయాలన్నా చట్టబద్దత ఇవ్వాలి.. అందుకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. మీ పై జరుగుతున్న దాడులపై కూడా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. మంత్రితో చర్చిస్తాం..
కేసులు ఎత్తేవేసే దిశగా ప్రయత్నం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Health Care
  • mahesh kumar goud
  • Medical Professionals
  • pcc chief
  • PMP

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions