Site icon NTV Telugu

Mahesh Kumar Goud: ఫోటో షూట్ కోసమే మూసీ నిద్ర.. మూడు నెలలు బస చేయండని సవాల్

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారని అన్నారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారు.. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని పేర్కొన్నారు. మూసీ పక్కన మూడు నెలల బస చేయండని మా సీఎం సవాల్.. నేను కూడా వస్తాను. మీరు నేను ఇద్దరం కలసి మూడు నెలలు అక్కడ బస చేద్దాం రండి అని సవాల్ చేశారు. అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతీసారి కిషన్ రెడ్డి బయటకి వస్తారు.. బీఆర్ఎస్ ను ప్రొటెక్ట్ చేయడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలస.. 10 రెట్లు పెరిగినట్లు నివేదిక..

ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అందుకు అడ్డుపడుతున్నారు.. సబర్మతి రివర్ ఫ్రంట్‌కి ఒక న్యాయం.. మూసీ రివర్‌కి ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటాం.. వారి పిల్లలకు విద్య అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుంది అనగానే.. వీళ్లకు భయం పట్టుకుందని అన్నారు. గుజరాత్‌ను ఎక్కడ తెలంగాణ వెనక వేస్తుందో అన్న భయం బీజేపీని వెంటాడుతుందని పేర్కొన్నారు. ప్రళయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు..
ఒక్కరోజు నిద్రతో అక్కడి ప్రజల అవస్థలు ఏం తెలుసుకున్నారో చెప్పండని ప్రశ్నించారు.

Minister Nadendla Manohar: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా!

డీపీఆర్ (DPR) వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టలో తెలుస్తుంది.. ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్లు తెలంగాణ అభివృద్ధి కుంటు పడింది.. అభివృద్ధిలో తెలంగాణ మార్పు చూస్తారు.. తెలంగాణ రైజింగ్ గా ముందుకు వెళ్తుందని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి కాళ్ళకు సాక్సులు వేసుకొని నిద్రపోయారు.. అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుంది.. బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి ఆపద వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం ఆదుకుంటున్నారని పీసీసీ చీఫ్ తెలిపారు.

Exit mobile version