NTV Telugu Site icon

Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్ల జీతాలను పెంచిన పీసీబీ..

Pcb

Pcb

ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు శుభవార్త చెప్పింది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు ఇచ్చే జీతాలను భారీగా పెంచింది. గతంతో పోలిస్తే తాజా కాంట్రాక్ట్‌లో వారికి అందించే మొత్తాన్ని దాదాపు 4 రెట్లు పెంచినట్లు క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. ప్రస్తుతం పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ కేటగిరీలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదీలు ఉన్నారు. అయితే, పీసీబీ వారికి నెలకు సుమారుగా రూ.13 లక్షలు ఇవ్వనుంది.. గతంలో నెలకు దాదాపు రూ.3.88 లక్షలు మాత్రమే వారికి ఇచ్చేది.. ఇక, పాకిస్థాన్ క్రికెటర్ల కాంట్రాక్ట్ గత జూన్‌లోనే ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రాక్టు లేకుండానే వాళ్లు ఆడుతున్నారు.

Read Also: Ram Shankar Katheria: దాడి కేసులో బీజేపీ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు పడే అవకాశం

దీంతో ఇప్పుడు పెంచిన జీతభత్యాల ప్రకారం ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి దాదాపు కోటిన్నర రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది వరకు ఉన్న కాంట్రాక్టు ప్రకారం ఆ జాబితాలోని ఆటగాళ్లు వార్షికంగా మొత్తం రూ.50 లక్షల కన్నా తక్కువగా అందుకున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకు జీతాలు తక్కువగా ఇచ్చే బోర్డుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒకటిగా ఉంది. కానీ తాజా అగ్రిమెంట్‌తో వారికి గతంతో పోలిస్తే పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తుంది.

Read Also: Keerthy Suresh: చిరంజీవి రియాక్షన్ సర్ప్రైజ్ చేసింది..మామూలు విషయం కాదు: కీర్తి సురేష్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో గతంలో రెడ్ బాల్, వైట్ బాల్ అనే కాంట్రాక్టులు ఉండేవి.. కానీ తాజాగా వాటిని 4 రకాలు విడదీశారు. ఏ-కేటగిరీలో ఉన్న వారికి నెలకు సుమారు రూ.13 లక్షలు, బీ కేటగిరీ వారికి రూ.8.7 లక్షలు, సీ, డీ కేటగిరీల్లోని ప్లేయర్లు నెలకు రూ.2.19 లక్షల నుంచి రూ.4.38 లక్షల వరకు అందుకోనున్నారు. ఇక, వచ్చే ఏడాది నుంచి ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయం కూడా పెరుగనుంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు మొత్తంలో డబ్బును అందుకోనుంది. సుమారు 38 మిలియన్ డాలర్లను పీసీబీ తీసుకోనుంది. ఈ డబ్బు రావడంతో.. ప్లేయర్ల జీతభత్యాలను పెంచేందుకు దోహదపడ్డాయి. అగ్రదేశాల ఆటగాళ్లతో పోలిస్తే పాక్ క్రికెటర్ల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి.

Read Also: Karnataka: దారుణం..రెండో తరగతి విద్యార్థినిపై పిన్సిపాల్ అత్యాచారం..

ఇక, ప్రపంచంలోనే ధనిక లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాక్ ప్లేయర్స్ ఆడటం లేదు.. కానీ ప్రపంచంలోని ఇతర దేశాల్లో జరిగే లీగ్‌లు ఆడినా.. ఐపీఎల్‌తో పోలిస్తే వారు ఇచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటుంది. పీసీబీ పెంచిన జీతభత్యాలు చూసుకున్నా పాకిస్థాన్ క్రికెటర్లు భారత ఆటగాళ్లతో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలోనే తీసుకుంటున్నారు. బీసీసీఐ ఆటగాళ్లను మొత్తం 4 గ్రేడ్లుగా విభజించింది. అందులో ఏ ప్లస్, ఏ, బీ, సీగా ఉన్నాయి. ఏ ప్లస్ గ్రేడ్‌లో రోహిత్, విరాట్, బుమ్రా, జడేజాలు ఉన్నారు.

Read Also: Bengaluru: జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే గ్యాంగ్‌స్టర్‌ హత్య

అయితే, వారు ఏడాదికి రూ.7కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. అదే పాకిస్థాన్‌లో ఏ గ్రేడ్ కాంట్రాక్టులోని ఆటగాళ్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిదీలు ఏడాదికి పొందేది కేవలం రూ.1.5 కోట్లే. బీసీసీఐ జాబితాలో ఏ గ్రేడ్‌లో ఉన్న భారత క్రికెటర్లు వార్షికంగా రూ.5 కోట్లు.. బీ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లు రూ.3 కోట్లు.. సీ గ్రేడ్‌లో ఉన్న ప్లేయర్లు రూ.కోటి చొప్పున ఆర్జిస్తారు. అయితే ఆటగాళ్లకు అత్యధిక మొత్తంలో జీతభత్యాలు ఇచ్చే బోర్డు జాబితాలో బీసీసీఐ తొలి స్థానంలో ఉంది.