PBKS vs MI: శ్రేయస్ అయ్యర్ మెరుపులు.. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్!
- క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ విజయం
- శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా మెరుపులు
- ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైన పీబీకేఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. 204 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ దాటికి ముంబై మరో టైటిల్ కల చెదిరింది. ఫైనల్‌కు వెళ్లడం పంజాబ్‌కు ఇది రెండోసారి. 2014లో జార్జ్ బెయిలీ నేతృత్వంలో పంజాబ్ మొదటిసారి ఫైనల్ చేరింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ ఫైనల్లో తలపడనుంది.
క్వాలిఫయర్-2లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8) విఫలమైనా.. జానీ బెయిర్‌స్టో (38: 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తిలక్ వర్మ (44: 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 15 పరుగులే చేసినా.. నమన్ ధీర్ (37: 18 బంతుల్లో 7 ఫోర్లు) ధాటిగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్స్ పడగొట్టగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టాయినిస్, యుజ్వేంద్ర చహల్, వైశాక్ విజయ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read
ఛేదనలో పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ప్రభు సిమ్రాన్ సింగ్ (6) తక్కువ పరుగులకే అవుట్ కాగా.. ఫామ్ మీదున్న ప్రియాంష్ ఆర్య (20) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ సమయంలో జోష్ ఇంగ్లిస్ (38: 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇంగ్లిస్ అవుట్ అయ్యాక పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. ఆరంభంలో కాస్త టైమ్ తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. ఆపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నేహల్ వధేరా (48: 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి కింగ్స్‌ను విజయం వైపు నడిపించాడు. నేహల్, శశాంక్ సింగ్ (2) అవుట్ అయినా.. శ్రేయస్ చివరి వరకూ క్రీజులో ఉండి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!