Site icon NTV Telugu

PBKS vs RCB: ఆర్సీబీ బౌలర్స్ అదరహో.. స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్..

Rcb

Rcb

నేడు బెంగళూరు, ఆర్సీబీ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌ ఈసారి తన సొంతమైదానం ముల్లాన్‌పుర్‌లో ఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు లక్ష్యం 158 పరుగులు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అదరగొట్టారు. అద్భుతంగా బౌలింగ్ వేశారు.. ఆర్సీబీ బౌలింగ్ ధాటికి పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

READ MORE: Nagpuri Ramesh : ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై సస్పెన్షన్ వేటు

కాగా.. పంజాబ్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించింది. ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కలిసి 26 బంతుల్లో 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రియాంష్‌ను స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. ప్రియాంష్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత కృనాల్ మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను కూడా అవుట్ చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ 17 బంతుల్లో 33 పరుగులు చేసి, మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.

READ MORE: Nagpuri Ramesh : ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై సస్పెన్షన్ వేటు

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు. కానీ 6 పరుగులు చేసి రొమారియో షెపర్డ్ చేతిలో ఔట్ అయ్యాడు. కాగా, నేహల్ వధేరా (5), స్టాయినిస్‌ (1) నిరాశపర్చారు. శశాంక్ సింగ్ (31*), మార్కో యాన్సెన్ (25*) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ 2, కృనాల్ పాండ్య 2, రొమారియో ఫెఫర్డ్ ఒక వికెట్ తీశారు. మరోపైపు.. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ 2, కృనాల్ పాండ్య 2, రొమారియో ఫెఫర్డ్ ఒక వికెట్ తీశారు.

Exit mobile version