NTV Telugu Site icon

Paytm : పేటీఎంకు షాకుల మీద షాకులు.. పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా

Paytm

Paytm

Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రతి రోజు హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు తాజా కేసులో పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుంచి కంపెనీ డైరెక్టర్ రాజీనామా చేశారు. ఇది కంపెనీ ధృవీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాఖలు చేసిన సమాచారం ప్రకారం.. పేటీఎం పేమెంట్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్న మంజు అగర్వాల్ ఫిబ్రవరి 1న ఆయన తన రాజీనామాను బోర్డుకు సమర్పించారు. ఆర్బీఐ నిషేధం కారణంగానే మంజు అగర్వాల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read Also:JEE Mains Results 2024: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాలు విడుదల!

వాస్తవానికి, జనవరి చివరి వారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త కస్టమర్లను జోడించకుండా పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ను నిషేధించింది. ఇందుకోసం ఆర్‌బీఐ కంపెనీకి ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా చేశారు. కంపెనీ ధృవీకరించింది. ఇంతకుముందు, చైనాతో ఈ కంపెనీ సంబంధాలపై భారత ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో చైనా విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

Read Also:BitCoin : రెండేళ్ల తర్వాత 50వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్

గత వారం ప్రారంభంలో కంపెనీ తన ఇ-కామర్స్ వ్యాపారం పేరును కూడా మార్చింది. పేటీఎం ఇ-కామర్స్ పేరును Pai ప్లాట్‌ఫారమ్‌లుగా మార్చారు. దీనితో పాటు, ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారంలో వాటాను పెంచుకోవడానికి కంపెనీ బిట్సీలాను కొనుగోలు చేసింది. ఆర్బఐ నిర్ణయం తర్వాత పేటీఎంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ కంపెనీలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల కూడా పేటీఎంపై ప్రజలకు నమ్మకం పోతుందని ఓ సర్వేలో ఓ విషయం బయటపడింది. ఈ సర్వే ప్రకారం, 49 శాతం చిన్న దుకాణదారులు ఇప్పుడు పేటీఎంకు బదులుగా ఇతర యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయమని ప్రజలను కోరుతున్నారు.