Credit Cards: అన్నింటికీ క్రెడిట్ కార్డు వాడేస్తున్నారా..? కొత్త రూల్స్‌తో జాగ్రత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Credit Cards: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1వ తేదీ నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. దీనిప్రకారం మీరు ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు వినియోగిస్తూ, నెలవారీ కరెంటు బిల్ 15 వందలు చెల్లిస్తుంటే..అదనంగా 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే.. ఇక్కడ కూడా బ్యాంకులు ఉచిత లావాదేవీలకు కొంత లిమిట్ ప్రకటించాయి. వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 20,000 రూపాయల వరకూ ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే వన్ పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. కాగా, క్రమంగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతోన్న విషయం విదితమే.. కొందరు ఇంటి అద్దులు సహా వివిధ బిల్లులను క్రెడిట్ కార్డుపై కట్టేస్తున్నారు. ఆ తర్వాత వెసులుబాటును బట్టి చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఇంటి అద్దెలపై అదనపు చార్జీలు వడ్డిస్తున్నాయి కొన్ని బ్యాంకులు.. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్.. ఇలా పలురకాల బిల్లు చెల్లింపై కూడా వడ్డించేందుకు సిద్ధం అయ్యాయి.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అసలు ఎందుకు ఈ మార్పు? బ్యాంకులు ఈ రుసుములను అమలు చేయడానికి రెండు ప్రధాన కారణాలు చెబుతున్నాయి.. తక్కువ వ్యాపారి తగ్గింపు రేటు (MDR): ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీకి చెల్లింపు గేట్‌వేలు వ్యాపారాలు వసూలు చేసే రుసుములను MDR సూచిస్తుంది. MDR వర్గాన్ని బట్టి మారుతుంది (కిరాణా, ప్రయాణం మొదలైనవి). యుటిలిటీ బిల్లు చెల్లింపుల కోసం, ఇతర వర్గాలతో పోలిస్తే MDR సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఇతర కొనుగోళ్లతో పోలిస్తే యుటిలిటీలను చెల్లించడానికి మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు బ్యాంకులు తక్కువ డబ్బు సంపాదిస్తాయి. రెండోది వ్యాపార దుర్వినియోగానికి సంభావ్యత: కొన్ని వ్యాపారాలు తమ వ్యాపార సంబంధిత యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి వ్యక్తిగత క్రెడిట్ కార్డ్‌లను దుర్వినియోగం చేయవచ్చు. సాధారణ కుటుంబానికి చెందిన యుటిలిటీ బిల్లు మొత్తం సాధారణంగా వ్యక్తిగత కార్డ్‌పై క్రెడిట్ పరిమితి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి, వ్యాపారాలు తమ ప్రయోజనం కోసం దీనిని ఉపయోగించుకోవడం ఉత్సాహం కలిగిస్తుంది. అదనపు రుసుము అటువంటి పద్ధతులను నిరుత్సాహపరుస్తుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!