పాయల్ రాజ్ పుత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హాట్ కే హీటేక్కిస్తుంది.. ఘాటు అందాలను ఎప్పుడూ దాచుకోదు.. దాంతో అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ఆర్ఎక్స్ 100`(RX100)తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తొలి సినిమాతోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్లు కారణంగా వరుస సినిమాలు చేసినా కూడా వాటితో పెద్దగా దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా `మాయా పేటిక` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో పాపులారిటిని సొంతం చేసుకుంది..
ప్రస్తుతం `ఆర్ఎక్స్ 100` దర్శకుడు అజయ్ భూపతితో `మంగళవారం’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ సినిమాను స్వాతి గుణపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. కాంతార సినిమా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఈ మూవీకి స్వరాలు అందిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. మరోసారి బోల్డ్ పాత్రలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. అందులో పాయల్ రాజ్‌పుత్ నగ్ననంగా దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాయల్ కూవీ ఈ సినిమాకు తనకు బ్రేక్ వస్తుందని తెగ ఆశపడుతోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది..
కథల విషయంలో నేను చేసిన పొరపాటును సరి దిద్దుకున్నాను.. ఇకమీదట అలాంటి తప్పులు చెయ్యను.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని పాయల్ తెలిపింది. ఇక తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చచ్చేంత పిచ్చి అని.. ఆయన తన ఫేవరెట్ హీరో అని పాయల్ మనసులో మాటను బయటపెట్టింది. సర్కారు వారి పాట సినిమాలో నాకు అవకాశం వస్తే బాగుండు అని కోరుకున్నాను.. కానీ, కీర్తి సురేష్ కు ఆ ఛాన్స్ దక్కిందని, ఆమె చాలా బాగా నటించిందని పాయల్ పేర్కొంది. ఇక మహేష్ బాబుతో ఒక్క సారైనా వర్క్ చేయాలని ఉందంటూ పాయల్ చెప్పుకొచ్చింది.. మరీ పాయల్ కోరికను మహేష్ బాబు తీరుస్తాడేమో చూడాలి..