NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan’s Tenali Tour Cancelled: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్‌ ఆరోగ్యం సరిగా లేనందున తెనాలి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్‌ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి.

Also Read: Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?: ఎంపీ భరత్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని జనసేనాని రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. రీ షెడ్యూల్ చేసిన పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. గత 4-5 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ పర్యటింస్తున్న విషయం తెలిసిందే. రోడ్‌ షో, బహిరంగ సభలతో తీరిక లేకుండా గడిపారు. జ్వరం కారణంగా పవన్‌ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే ఆయన చికిత్స, విశ్రాంతి తీసుకోనున్నారు.

Show comments