పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలలో ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని ఎడిట్ చేసి వాటిని ఒక గ్లిమ్స్ గా గత నెల విడుదల చేయడం జరిగింది.. ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఆ గ్లిమ్స్ చూడగానే భారీ హిట్ వస్తుంది అనే ఫీలింగ్ ని కలిగించింది పవన్ ఫ్యాన్స్ లో. పవన్ కళ్యాణ్ రేంజ్ వింటేజ్ మాస్ మరియు స్వాగ్ ని బాగా చూపించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. బద్రి సినిమా పవన్ కళ్యాణ్ ని మరోసారి బయటకి తీసినట్టుగా అయితే అనిపించింది. కేవలం పది రోజుల్లోనే ఇంత స్టఫ్ ని ఇస్తే, ఇక సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారటా అభిమానులు
ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ కార్యక్రమాలు స్పీడ్ గా జరుగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మూవీ టీం వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.ఈ సెట్స్ చూస్తూ ఉంటే ఎదో కాలేజీ సెట్స్ ని నిర్మిస్తున్నట్టుగా అయితే అనిపించింది. ఇక్కడ సెకండ్ షెడ్యూల్ లో ఇంటర్వెల్ ఫైట్ ని తీస్తున్నట్లు సమాచారం.ఈ ఫైట్ కి ముందు పవన్ కళ్యాణ్ మార్క్ భారీ డైలాగ్స్ తో పాటు రిస్కీ స్తంట్స్ తో కూడుకున్న ఫైట్స్ ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ ఇంటర్వెల్ సన్నివేశం ది బెస్ట్ గా నిలిచిపొయే విధంగా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఈ ఏడాదిలోగా షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం.