NTV Telugu Site icon

Pawan Kalyan: ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.. సీఈసీ చర్యలు తీసుకోవాలి..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: వాలంటీర్‌ వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఏ అవకాశం దొరికినా.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. అయితే, వాలంటీర్లు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తప్పు పడుతూ జనసేనాని ట్వీట్‌ చేశారు.. ఓటరు జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల ప్రక్రియ. నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా జరగాలని కోరిన ఆయన.. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్ఓలతో ఏపీ వాలంటీర్లు ఇంటింటికి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారని విమర్శించారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన.. ఏపీలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సీఈసీని జనసేన డిమాండ్ చేస్తోందంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు పవన్‌.. ఇక, ఓటర్‌ వెరిఫికేషన్‌లో ఏపీలో వాలంటీర్లు పాల్గొంటున్నారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను తన ట్వీట్‌లో జత చేశారు పవన్‌ కల్యాణ్‌.

Read Also: Husband Caught Wife Cheating: ఢిల్లీ మెట్రోలో ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య.. రివర్స్‌లో దాడి

ఇక, అంతకు ముందు.. బైజూస్ ట్యాబ్‌ల వ్యవహారంపై కూడా ట్వీట్‌ చేశారు పవన్?. బైజూస్ సంస్థ నష్టాల్లో ఉందన్న కథనాలను ట్యాగ్ చేసిన పవన్.. పీఎంవో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తన ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు.. టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు.. టీచర్ ట్రైనింగ్ లేదు.. నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు వస్తాయి.. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిందా..? ట్యాబు పంపిణీ కోసం ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేశాయి..? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు..? ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలంటూ ట్వీట్‌ చేశారు. ట్యాబ్‌లు మంచివే.. కానీ, ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించండి అని సూచించారు. యాప్‌ల కన్నా.. ముందు ఉపాధ్యాయుడు తప్పని సరిగా ఉండేలా‌ చూడండి అంటూ ట్వీట్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు సూచించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.