Pawan Kalyan: కర్ణాటక అటవీ శాఖ మంత్రితో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్

  • కర్ణాటక అటవీ శాఖ మంత్రితో సమావేశం కానున్న పవన్‌ కళ్యాణ్
  • ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరపనున్నారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేపట్టనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని అటవీ శాఖ మంత్రిని కోరనున్నారు. కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరనున్నారు.

Read Also: YS Jagan: నేడు వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

పొలాల మీద పడే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఎనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఏపీలో అందుబాటులో కేవలం రెండు కుంకీ ఏనుగులే ఉన్నాయని వెల్లడించారు. కుంకీ ఎనుగుల కొరతతో ఊళ్ల మీద పడే ఏనుగుల మందను తరమలేకపోతున్నామని అటవీ సిబ్బంది వెల్లడించారు. కర్ణాటకలో కుంకి ఏనుగులు లభ్యత ఉంటుందని డిప్యూటీ సీఎంకు అధికారులు చెప్పారు. తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని గతంలోనే పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు.