Site icon NTV Telugu

Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది

Pawan Kalyan

Pawan Kalyan

టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.

Read Also: Bandi Sanjay: రజాకార్ సినిమా చూసిన ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ కూడా చూసి..!

2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుందన్నారు. 2014లో వెంకన్న ఆశీస్సులతో ఎన్డీఏ విజయం సాధించింది.. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో అంతకు మించిన విజయం దక్కించుకుంటామని పవన్ కల్యాణ్ తెలిపారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అంటుంటే.. జగన్ దాన్ని పక్కన పెట్టి అవినీతి చేస్తున్నారని దుయ్యబట్టారు.

Read Also: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు

మద్యం, ఇసుకలో అక్రమాలు అని మండిపడ్డారు. ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోయాయి.. వైఎస్ వివేకాను హత్య చేశారు.. అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని పవన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారన్నారు. అయోధ్యకు రాముడిని తెచ్చిన మోడీ ఇక్కడున్నారు.. చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత అని విమర్శించారు. ధర్మానిదే విజయం.. కూటమిదే గెలుపు అని పవన్ కల్యాణ్ తెలిపారు.

 

Exit mobile version