NTV Telugu Site icon

Pawan Kalyan: కైకలూరు బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పవన్ హమీ ఇచ్చారు. ప్రజలు భయం లేకుండా బతకాలన్నదే తన కోరిక అన్నారు.

Read Also: Chandrababu Letter: సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత బహిరంగ లేఖ

జగన్ అబద్దాల కోరు అని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకుకి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కైకలూరు ఎమ్మెల్యేది కాదు, ఆయన కొడుకుది కాదన్నారు. వైఎస్ జగన్ కుతంత్రాలతో గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థికి ఇచ్చారని ఆరోపించారు. కూటమి తరపున బీజేపీ నుంచి కామినేని పోటీ చేస్తున్నారని.. కాంటూరు సమస్యపై కామినేని కేంద్రంతో మాట్లాడతారన్నారు. గంజాయి, అమ్మాయిల అదృశ్యం, యువత గంజాయికి బానిసలుగా మారుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కోసం తాను ఎంత తగ్గాలో అంత తగ్గానన్నారు. లాండ్ టైటిలింగ్‌ యాక్టు కాదు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అది అని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి రాగానే కైకలూరు నియోజకవర్గంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మిస్తానని పవన్‌ హామీ ఇచ్చారు.