Pawan Kalyan Sensational Commentsy Over Kapu Reservation: తాను మెత్తగా కన్పిస్తానేమో కానీ.. మెత్తటి మనిషిని కానంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అమరావతి కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశమైన పవన్.. సంఖ్యాబలం ఎక్కువ ఉప్పటికీ, అధికారం చేజిక్కించుకోలేని కులాల్లో కాపు కులం ఉందన్నారు. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్సుమెంట్ కోసం అడుక్కోవడం దేనికని ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలని సూచించారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగపడడం లేదని ధ్వజమెత్తారు. కాపులు అధికారంలోకి వస్తే.. మిగిలిన కులాలను తొక్కేస్తారనే దుష్ప్రచారంతో నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. కాపులు పెద్దన్న పాత్ర వహించాలని, అప్పుడు ఊళ్లో ఏ కష్టం వచ్చినా కాపుల దగ్గరకే వస్తారని అన్నారు. ఇది అలవర్చుకుంటే అధికారం మీ దగ్గరకు వస్తుందని తెలిపారు.
Rajinikanth: రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నా.. రజినీకాంత్ క్లారిటీ
సమాజంలో విడదీసే మనుషులే ఎక్కువగా ఉన్నారని, కలిపేవాళ్లు చాలా తక్కువ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2009లో జరిగిన ఘటనలు తనలో పంతం పెంచాయని, సంఖ్యా బలం ఎక్కువ ఉన్న కులాల్లో ఐక్యత ఉండదని చాలా మంది అన్నారని గుర్తు చేసుకున్నారు. అధికారం చూడని ఏ కులం కూడా ఈ మాట పడకూడదన్నారు. దీని కోసం ఒక్కడు అన్ని అవమానాలు భరించాలి, త్యాగాలు చేయాలన్న ఆయన.. దీనికి తానను కంకణం కట్టుకుని ఉన్నానన్నారు. తన తల్లి గాజుల బలిజ అని, తండ్రి కాపు అని తెలిపిన పవన్.. తానెంత వాస్తవమో, తన కులం కూడా అంతే వాస్తవమన్నారు. తాను కాపు కులంలో పుట్టొచ్చు కానీ.. తన మనస్సు మాత్రం అట్టడుగున ఉన్న రెల్లి కులం వైపే ఉంటుందన్నారు. తాను కాపు నేతను కానేమో కానీ.. కాపుల సమస్యలను, ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న వాడినని చెప్పారు. కాపులు పార్టీ నడపలేరనే విమర్శలు చేసే వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలన్నారు. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం ఉండదని.. దీన్ని తాను ఎదుర్కుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Margani Bharath Ram: అతడో అరిటాకు, సర్కస్‌లో బఫూన్.. ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు
తానెప్పుడూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని.. కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించకుండానే ఒప్పందాలు ఉంటాయని పవన్ తెలిపారు. అవమానపడి, గింజుకునే స్థాయిలో ఒప్పందాలు ఉండవని స్పష్టం చేశారు. జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించమని హామీ ఇచ్చారు. తాము ఏ పార్టీ అజెండాను మోయమన్న ఆయన.. వేయి కోట్లు ఆఫర్ అని ఒకరంటారని, వేయి కోట్లతో పార్టీని నడపగలమా? అని ప్రశ్నించారు. సంకల్పం లేకుంటే.. రూ. 10 వేల కోట్లున్నా పార్టీని నడపలేమన్నారు. సీఎం కుటుంబం దగ్గరున్న మైన్స్ బలిజలకు చెందినవేనని, కానీ పోటీ తట్టుకోలేక వెనుకపడ్డారని అన్నారు. కోస్తాలో కాపులు గొంతెత్తగలరు.. కానీ సీమలో బలిజలు గొంతెత్తే పరిస్థితి లేదన్నారు. నువ్వెంత ఎదిగినా సరే.. నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలనే ధోరణి సీఎం జగన్‌ది అని ఆరోపించారు. మనతో ఉన్న వాళ్లే మనల్ని వెన్నుపోటు పొడుస్తారని, తాను ఓడిపోతే మీసాలు మేలేసి తొడగొట్టింది కాపులేనని, అసలు తాను ఓడిపోతే మీకేంటి ఆనందమని పవన్ నిలదీశారు.
Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
తనని బీసీ, ఎస్సీ, కాపులతో తిట్టిస్తారని.. కానీ మిగిలిన వాళ్లు ఎందుకు తిట్టరని పవన్ ప్రశ్నించారు. వాళ్లు మంచి వాళ్లుగా ఉండాలి, మనలో మనం కొట్టుకోవాలన్నదే వారి వ్యూహమని వివరించారు. దీన్ని గుర్తించినంత వరకు రాజ్యాధికారం దక్కదన్నారు. కాపులు, బీసీలు సంఘాలుగా విడిపోయాయన్న ఆయన.. కాపులు పెద్దన్న పాత్ర పోషించి బీసీ, ఎస్సీలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. రెడ్డి, కమ్మ వర్గాలతో గొడవలు పెట్టుకోకూడదని.. అగ్ర వర్ణాలను గౌరవించడమంటే లొంగిపోయినట్టు కాదని వివరించారు. తానింకా ప్రతికూల పవనాల్లోనే పార్టీని నడుపుతున్నానని.. అనుకూల పవనాలు రాలేదని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోట పోటీ చేయండని సూచిస్తున్నారని.. గాజువాక, పీఠాపురం, భీమవరం సెగ్మెంట్లల్లో పోటీ చేయమని చెప్తున్నారన్నారు. కాపులంతా ఓట్లేస్తే.. గతంలో పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచేవాడినన్నారు. తన అభిమానులు కూడా రాజకీయం వచ్చేసరికి ఓటు వేయలేదని.. ఇది వాస్తవమని.. దీన్ని అంగీకరించాల్సిందేనని పవన్ అన్నారు.
Kapil Sharma: అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు
తాను తలచుకుంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయగలనని.. కానీ తనకు పేదల సేవలోనే తృప్తి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మా కులపోడే అంటూ తనని తిడుతున్నారని.. తనని విమర్శించండి కానీ కులాన్ని కించపరచొద్దని అన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న ఆయన.. కాపులు కొద్దిగా మెత్తగా మాట్లాడమని కోరారు. ఇప్పుడొచ్చి మా కులం అంటున్నారని, కానీ ఎన్నికల్లో వేరే వారికి ఓటేస్తారని మండిపడ్డారు. ఓటుకు డబ్బు తీసుకోకూడదని.. ఒకవేళ డబ్బులు తీసుకోకుండా ఉండలేకపోతే, అక్కడ తీసుకొని గ్లాసు గుర్తుకు ఓటు వేయండని, వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దని కోరారు. తనకు కాపులు అక్కర్లేదని చెప్పిన జగన్‌కి ఓటేశారని.. నా ఆత్మ గౌరవాన్ని ప్రశ్నిస్తున్న మీరు, మీ ఆత్మ గౌరవం గురించి ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు. గతంలో తునిలో కాపు రిజర్వేషన్లు డిమాండ్ వారు.. ఇప్పుడెందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు.