NTV Telugu Site icon

Pawan Kalyan: జగన్ సర్కార్‌పై పవన్ కౌంటర్లు.. చర్యలేంటో ఆ దేవుడికే ఎరుక ..!

Pawan

Pawan

Pawan Kalyan: సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ ద్వారా వరుస కౌంటర్లు వేశారు.. అన్నమయ్య డ్యాం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ ట్వీట్‌ చేసిన పవన్.. క్లాస్ వార్ అంటూ జగన్ చేసిన కామెంట్ల మీద సెటైర్లు వేశారు.. అధికారికంగా రూ. 500 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఉన్న రిచెస్ట్‌ సీఎం.. నిరంతరం కార్ల్ మార్క్స్ లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు. కార్ల్ మార్క్స్ లాగా ‘వర్గ యుద్ధం’ జగన్ మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు.. అణచివేసే వారే.. అణచివేతకు గురైనవారిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న ఆయన.. నా కామెంట్లపై సందేహాలు ఉంటే, ఏపీ మానవ హక్కుల సంఘాలను సంప్రదించండి అని సలహా ఇచ్చారు.

Read Also: Adipurush: మళ్ళీ వివాదంలో ఆదిపురుష్.. కొంప ముంచిన కొత్త పోస్టర్!

19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వల్ల.. ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపత్తూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారని తన ట్వీట్‌ ద్వారా గుర్తుచూశారు పవన్‌.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని.. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో తెలీదు అని ఎద్దేవా చేశారు.

Read Also: PBKS vs RR: రాజస్థాన్‌, పంజాబ్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్.. ఓడితే ఇంటికే.

అన్నమయ్య డ్యామ్ విషయంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలేంటో ఆ దేవుడికే ఎరుక? అని సెటైర్లు వేశారు పవన్‌ కల్యాణ్‌.. అన్నమయ్య డ్యాంని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు.. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక.. కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు అని విమర్శలు గుప్పించారు.. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ. 660 కోట్లకు అప్పచెప్పారంటూ ఆరోపణలు గుప్పించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.