NTV Telugu Site icon

Pawan Kalyan: గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయం

Pawan

Pawan

విశాఖలోని గాజువాక జంక్షన్ లో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు మీద పోరాటం చేస్తుంటే సీఎం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైజాగ్ ఎంపీ ఒక రౌడీషీటర్ అని పవన్ ఆరోపించారు. ఒక రౌడీషీటర్ ను వైజాగ్ ఎంపీగా గెలిపించారని.. అటువంటి ఎంపీ ప్రధాని దగ్గరకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడగలరా అని దుయ్యబట్టారు.

Read Also: Vadivelu: కమెడియన్ వడివేలు అలాంటివాడా.. ఆమెకు ఆఫర్స్ రాకుండా చేసి.. సెట్ లో అలా అడిగి

విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన రైతులు పరిహారం రాక ఇప్పటికీ ఆలయాల్లో ప్రసాదాలు తిని బ్రతకలిసిన పరిస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తనకు పోరాటం నేర్పింది ఉత్తరాంధ్ర అని తెలిపారు. మరోవైపు 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Lokesh Kanagaraj : త్వరలోనే రోలెక్స్ చిత్రాన్ని తెరకెక్కించనున్న స్టార్ దర్శకుడు..?.

కేసులున్నోడికి, మర్డర్లు, లూటీలు చేయించేవాడికి ధైర్యం ఉండదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను ప్రధాని, హోమ్ మంత్రి కాళ్ళ మీద పడైన స్టీల్ ప్లాంట్ సాధించగలనన్నారు. ఆంధ్రా ఎంపీలంటే దోపిడీదారులనే అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో ఉందని పవన్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తానని.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, పార్టీలు కలిసి వస్తే ఐరన్ ఓర్ సొంత గనులు కేటాయించే వరకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. గంగవరం పోర్టు వల్ల నిర్వాసితులను ఆదుకోవాలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికే ఎక్కువని.. ప్రభుత్వంపై ప్రజల్లో కోపం వ్యతిరేకత పెరుగుతోందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరోవైపు గంగవరంలో దోపిడీకి గురైన కార్మికులకు న్యాయం జరగకపోతే హర్తాళ్ కు దిగుతామని ఆయన హెచ్చరించారు.