NTV Telugu Site icon

Pawan Kalyan: నేడు తాండూరులో పవన్‌ కళ్యాణ్ పర్యటన..

Pawan Kalyan

Pawan Kalyan

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే సూర్యపేట, దుబ్బాక, కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా, వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో నేడు పర్యటించబోతున్నారు. తాండూరులో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరపున ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

Read Also: Vizag Capital: వైజాగ్‌ నుంచి పాలనకు ముహూర్తం ఫిక్స్.. ఏర్పాట్లలో మునిగిపోయిన అధికారులు

కాగా, తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా, తాండూర్ లో ఉన్న యువతకు కావాల్సిన పలు రకాల అంశాలను ఈ సభలో పవన్ కళ్యాణ్ తెలియజేయనున్నారు. గతంలో ఉన్న నాయకులు తాండూర్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు.. చాలా మంది యువత ఉద్యోగాలు లేక.. నిరుద్యోగులుగా మిగిలి పోవడమే కాకుండా ఈ ప్రాంతంలోని కర్మాగారాలలో రోజువారి కూలీలుగా పనిచేయడం జరుగుతుందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ తెలిపారు. అంతే కాకుండా జనసేన అభ్యర్థిని గెలిపించినట్లైతే.. తాండూర్ ప్రాంతానికి చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలో చెప్పబోతున్నారు అని ఆయన చెప్పారు.

Read Also: Viral Video : హ్యాట్సాఫ్ బామ్మ .. 97 ఏళ్ల వయస్సులో సాహసం చేసిన బామ్మ.. వీడియో వైరల్..

అయితే, ఇవాళ పవన్ కళ్యాణ్ తాండూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో చేయనున్నారు. ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అధికారికంగా పేర్కొనింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లేక హెలికాప్టర్ ద్వారా నేడు తాండూరుకు చేరుకుంటారు.. అక్కడ జనసేన అభ్యర్థికి సపోర్టుగా ప్రచారం చేయనున్నారు. మరో వైపు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆంధ్ర ప్రదేశ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అక్కడ సీఎం వైఎస్ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా టీడీపీ పార్టీతో కలిసి జనసేన నిరసనలు, ఆందోళనలు చేస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేలా బీజేపీ, జనసేన వ్యవహరిస్తున్నాయనే అపవాదును మూటగట్టుకుంది.