NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌.. ఇది వారి బాధ్యతే అన్న డిప్యూటీ సీఎం

Pawan Kalyan

Pawan Kalyan

పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నకిలీ ఐపీఎస్‌గా గుర్తించారు. తాజాగా ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “నకిలీ ఐపీఎస్ అధికారి ముసుగులో ఓ వ్యక్తి వచ్చాడని నాకు తెలిసింది. ఫొటోలు కూడా దిగాడు అని చెబుతున్నారు. పోలీసులు దీన్ని ఎందుకు గమనించలేక పోయారు. ఇది రాష్ట్ర పోలీసు, ఇంటెలిజెన్స్, హోం శాఖ, డీజీపీ బాధ్యత. నాకు కేవలం పని చేయడం మాత్రమే తెలుసు. అధికారం లేనప్పుడు కూడా పని చేశాం. ఇప్పుడూ పని చేస్తున్నాం. పని చేయడం మా బాధ్యత.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

ఇదిలా ఉండగా.. అరెస్టయిన నకిలీ ఐపీఎస్‌ను విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాస్.. ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని ఆ వ్యక్తి చెబుతున్నాడు. తన సొంత కార్ ఇంటి దగ్గరే విడిచి పెట్టి వేరే కార్లో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన సూర్య ప్రకాష్ ను.. విజయనగరం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్య ప్రకాష్ ఎస్కేప్ అయ్యేందుకు స్థానిక ఏఆర్ కానిస్టేబుల్ సహకరించాడు. తన వాహనాన్ని కూడా ఆ కానిస్టేబుల్ ఇంటి దగ్గరే విడిచి పెట్టాడు. ఇక, సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేసినట్లు పోలీసులు గుర్తించారు.

 

Show comments