NTV Telugu Site icon

Pawan Kalyan : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్

Pawan

Pawan

రాఖీ పండుగను పురస్కరించుకొని జనసేప పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక. ఈ పర్వదినం సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అక్కాచెల్లెళ్లు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపడుచులకు అండగా ఉంటామని రక్ష కట్టించుకుంటున్న మనం.. మన కళ్లెదుట ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మన సమాజం, ముఖ్యంగా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం శ్రేయస్కరం కాదు.

Also Read : Pushpa 2 : లీక్ అయిన డైలాగ్స్.. ఈ సారి మరింత ఆసక్తికరంగా వున్నాయిగా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ అదృశ్యాల గురించి ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే మన ఆడబిడ్డల గతేంటి? వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు వినేవారు ఎవరు? ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధన్.. ఆ రోజు రావాలని ఆశపడుతున్నాను. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని మహిళలు అందరికీ ఈ శ్రావణ పౌర్ణమి శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : Mamata Banerjee: మళ్లీ తడబడిన ముఖ్యమంత్రి.. మహాభారతం ఎవరు రాశారో కూడా తెలియదా? మేడమ్