Pawan Kalyan : అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని, ఇందులో భాగంగానే కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘కులాల మధ్య అంతరాలు తగ్గించి… అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు భిన్నంగా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోంది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం అందుతోంది. ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయి. బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.
Also Read : IND VS AUS: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా… ఆ విధమైన కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కులాల మధ్య చిచ్చులు రేపి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే బలిజలకీ, యాదవుల మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారు. ఆ కులాల్లోనూ వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బ తీసి తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారు. ఈ రోజు తిరుపతి కావచ్చు… రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా.. భేదభావాలతో ఉండేలా చేయడమే కుట్రదారులు పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ… ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలి. అందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలి.’ అని ప్రకటనలో పవన్ పేర్కొన్నారు.
Also Read : Comedian Khyali Saharan: మద్యం మత్తులో యువతిపై హాస్యనటుడు అత్యాచారం
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.