NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ కార్ కలెక్షన్ ఇదే..

Pavan List

Pavan List

Pawan Kalyan: పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పవన్ తన అఫిడవట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తన అప్పులను కూడా వెల్లడించిన పవన్ తన గ్యారేజీలో ఉన్న కార్ కలెక్షన్ వివరాలను తెలిపారు. ప్రస్తుతం తన గ్యారేజీలో రూ.14 కోట్ల విలువైన 11 వాహనాలు ఉన్నట్లు జాబితాలో పొందుపరిచారు. అందులో ఒక ద్విచక్ర వాహనం కాగా మిగతావి కార్లు, ఒక పికప్ ట్రక్ ఉంది. పవన్ తో తనకు ఎంతో ఇష్టమైన, రూ.32,66,536 విలువైన హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది.

READ MORE: PM Modi: వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిపై పీఎం ఫైర్..

దాంతో పాటు తన గ్యారేజీలో రూ. 72.9 లక్షల విలువైన బెంజ్- ఆర్‌ క్లాసిక్ 350, రూ.13.82 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ.9.19 లక్షల విలువైన యోధా పికప్ ట్రక్, రూ.2.42 కోట్ల విలువైన బెంజ్ మే బ్యాచ్- ఎస్ క్లాసిక్ 560, రూ. 5.47 కోట్ల విలువైన రేంజ్ రోవర్ – స్పోర్ట్స్, రూ. 2.53 కోట్ల విలువైన టొయాటా టయోటా ల్యాండ్ క్రూయిజర్, రూ.1.11 కోట్ల విలువైన టయోటా వెల్ ఫైర్, రూ. 71.54 లక్షల విలువైన జీప్ వాహనం, రూ. 23.49 లక్షల విలువైన రెండు మహీంద్రా స్కార్పియో ఎస్ 11 వాహనాలు ఉన్నాయి.

Show comments