OG: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఉండటంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన లైనప్ లో వున్నా సినిమా షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ ఇచ్చారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగియడంతో పవన్ కల్యాణ్ మళ్ళీ మూవీ షూటింగ్స్ లో పాల్గొననున్నారు.అయితే పవన్ కల్యాణ్ లైనప్ లో వున్న క్రేజీ మూవీ “ఓజి”.ఈ సినిమాను ప్రభాస్ సాహో ఫేమ్ సుజీత్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్నిడీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
Read Also :Adah Sharma : సెన్సార్ పూర్తి చేసుకున్న అదా శర్మ ‘C.D’..
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఓజీ నుంచి ఇప్పటికే “హంగ్రీ చీతా” గ్లింప్స్ రిలీజ్ చేయగా నెట్టింట రికార్డు వ్యూస్ తో అదరగొట్టింది.అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.”ఓజి” మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ జూన్ 4న రాబోతుంది అంటూ ఓ నెస్ సోష మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.అయితే ఈ న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.