Site icon NTV Telugu

Pawan Kalyan : పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్‌

Pawan Kalyan Nomination

Pawan Kalyan Nomination

ఏపీలో ఎన్నికలు రచ్చ రేపుతున్నాయి. వేసవిలో ఎండకంటే.. రాజకీయాల వేడి ఠారెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు పిఠాపురంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎండిఓ కార్యాలయంలో ఉన్న ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం పిఠాపురం నుంచి చేబ్రోలు వెళ్లిపోయిన పవన్.. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొనున్నారు.

 
Hardik Pandya: హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్!
 

అయితే.. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ బయలుదేరి.. గౌలలప్రోలు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, మండలపరిషత్, తహసీల్దారు కార్యాలయాలు, బస్టాండు మీదుగా పిఠాపురం పట్టణంలోని ప్రవేశించి పవన్‌… పశువుల సంత, ఆర్టీసీ కాంప్లెక్స్, చర్చి సెంటర్, ఉప్పాడ సెంటర్, పాతబస్టాండు, అంబేద్కర్ సెంటర్, ప్రభుత్వాను పత్రి సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి పిఠాపురం మండలపరిషత్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినే షన్ పత్రాలు అందజేశారు.

 
Dulam Nageswara Rao: కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయం

Exit mobile version