Site icon NTV Telugu

Pawan Kalyan: పెద్ద ప్లానింగే.. పవన్ కళ్యాణ్ ను అలా చూసేందుకు సిద్ధంగా ఉండండి..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ వీడియో పోస్ట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “ఇట్ బిగిన్స్!!” అనే క్యాప్షన్‌తో విడుదలైన అప్డేట్ ఆయన నటించే తర్వాతి సినిమాపై ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకు పొడగింపుగా తాజాగా మరో వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది.

Arjun Tendulkar Wedding: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్స్..

తాజాగా విడుదల చేసిన వీడియోకు “గెట్ రెడీ టూ విట్నెస్ సంథింగ్ హ్యుజ్ (Get Ready to witness Something Huge)” అంటూ క్యాప్షన్‌ను ఇచ్చారు. ఈ వీడియోలో పవర్ స్టార్ ముఖాన్ని చూపించకపోయిన ఆయన కటానా కత్తి ఒరలో పెడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించబోయే తర్వాతి చిత్రానికి పెద్ద ప్లానింగే చేస్తున్నట్లు అర్థమవుతింది. పవన్ కల్యాణ్ చివరిసారిగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “They Call Him OG” లో కనిపించారు. 2025లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.

F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..

సురేందర్ రెడ్డి – పవన్ కల్యాణ్ కాంబో?
ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ తల్లూరి భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. స్టైలిష్ మాస్ యాక్షన్ చిత్రాలకు పేరున్న సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ కాంబినేషన్ అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కథ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.. కానీ, విజువల్స్ చూస్తే హై ఇంటెన్సిటీ, లార్జర్ దాన్ లైఫ్ కథనం ఉండే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version