NTV Telugu Site icon

Amitshah-Pawan Kalyan: అమిత్‌ షాతో పవన్‌ భేటీ.. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ

Amit Shah Pawan Kalyan

Amit Shah Pawan Kalyan

Amitshah-Pawan Kalyan: తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటూ ఈ భేటీ సాగింది. అనంతరం పవన్‌ కళ్యాణ్ అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు.

Also Read: Video: లైవ్‌ డిబేట్‌లో కొట్టుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌లు పవన్‌ కళ్యాణ్‌తో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తపరిచారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు అంశం తెరమీదకు వచ్చిన విషయం విదితమే.

Show comments