NTV Telugu Site icon

Pawan Kalyan Meets With PM Modi: ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఏం చర్చించారంటే?

Pspk Modi

Pspk Modi

యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం బీజేపీ కోర్‌కమిటీ సమావేశం అనంతరం పవన్‌తో ప్రధాని సమావేశం ఉండాలి. కానీ వర్షం కారణంగా ప్రధాని పర్యటన ఆలస్యం కావడంతో.. కోర్ కమిటీ సమావేశం కంటే ముందే పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీకి వపన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ప్రధాని మోడీ-పవన్ భేటీ పై సర్వత్రా ఉత్కంఠ రేగిన సంగతి తెలిసిందే. ఏపీలో ఇటీవల జరిగిన తాజా పరిణామాలని మోడీ వద్ద ప్రస్తావించారు.

Read Also: Pawan Kalyan: ఈనెల 13న విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

విశాఖలో పవన్ పర్యటనను అడ్డుకున్న ఘటన అంశాన్ని ప్రస్తావిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రుషికొండలో తవ్వకాలను చర్చించారని, తవకివ్వాల్సిన రోడ్ మ్యాప్ విషయాన్ని పవన్ ప్రస్తావించారని తెలుస్తోంది. వివిధ అంశాలతో కూడిన రిప్రజెటేషన్ను ప్రధానికి అందచేశారు పవన్ కళ్యాణ్. మూడేళ్ల తర్వాత ప్రధాని మోడీతో పవన్ భేటీ కావడంతో ఏం మాట్లాడారనేది ఆసక్తికరంగా మారింది.

అంతకుముందు విశాఖకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. మధురైలో వర్షం కారణంగా విశాఖకు ఆరగంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రధాని మోడీ. బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఇది సాగింది. అనంతరం విశాఖ ఐఎన్‌ఎస్‌ చోళ గెస్ట్‌హౌస్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. శనివారం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ప్రధాని మోడీ సభావేదికపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మాత్రమే ఉంటారు. రేపటి సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

Read Also: Pawan Kalyan: ఈనెల 13న విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన