Janasena-TDP: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆదివారం రాత్రి మళ్లీ భేటీ అయ్యారు. రెండు పార్టీల పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై విస్తృత చర్చ జరిగినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని అంటున్నారు. ఉమ్మడి సభల నిర్వహణపై రెండు దఫాల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు – పవన్ మరోసారి భేటీ కానున్నారు. అన్ని అంశాల పైనా ఎనిమిదో తేదీన జరిగే భేటీపై మరింత టీడీపీ – జనసేనలు క్లారిటీకి రానున్నాయి.
Read Also: AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ ఎప్పుడంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహించడంతో జనసేన పోటీ చేయనున్న స్థానాలపై ఒక క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్ట్‌ను పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే అవకాశాలున్న స్థానాలు ఇవేనని ప్రచారం జరుగుతోంది. ఇంకా మరిన్ని స్థానాల్లో స్పష్టత రావాల్సి ఉంది. తర్వాత భేటీలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తెనాలి, భీమిలి, నెల్లిమర్ల లేదా గజపతి నగరం, విశాఖ నార్త్ లేక సౌత్, చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి లేదా యలమంచిలి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి. గన్నవరం, రాజానగరం, రాజమండ్రి (రూరల్) లేదా తూ.గోలో మరో సీటు, అమలాపురం, నరసాపురం. భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఏలూరు లేదా కైకలూరు, దర్శి లేదా చీరాల, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేక చిత్తూరు జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా కొన్ని స్థానాల గురించి స్పష్టత రావాల్సి ఉంది.
