NTV Telugu Site icon

Pawan Kalyan: రెండో రోజు రాజమండ్రిలో పవన్ పర్యటన.. పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ..

Pawan

Pawan

Janasena: నేడు రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటల నుంచి రాజమండ్రి ఏవీఏ రోడ్ లో ఉన్న జనసేన పార్లమెంటు కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు, ముఖ్య నేతలతో ఆయన సమీక్ష సమావేశం కానున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనే విషయాలపై ప్రధానంగా చర్చ చేయనున్నారు. రాజానగరం, రాజోలు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది.

Read Also: Okkadu X Gilli: రీమేక్ చేసుకోవడమే కాకుండా మా సినిమానే అంటారా?

కాగా, ఈ సమావేశంలో ఈ రెండు స్థానాల్లో ( రాజనగరం, రాజోలు ) పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక, రాజమండ్రి రూరల్, పి.గన్నవరం, పిఠాపురం, కాకినాడ రూరల్ స్థానాలను సైతం జనసేన పార్టీ ఆశిస్తుంది. నేటి సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి రాజమండ్రిలోనే జనసేనాని బస చేయనున్నారు. ఇక, రేపు ఉదయం రాజమండ్రి నుంచి భీమవరంకు పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళనున్నారు.