సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమాతో సూపర్ హిట్ కొట్టి యంగ్ స్టార్ హీరో అనిపించుకునే స్థాయికి వచ్చిన తర్వాత చేసిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మహేష్ బాబుని సూపర్ స్టార్ ని చేసింది. ఈ ఒక్క సినిమా మహేష్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. అజయ్ పాత్రలో మహేష్ బాబు బాక్సాఫీస్ తో కబడ్డీ ఆడేసాడు. మహేష్ లోని ఇంటెన్సిటీని గుణశేఖర్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. మణిశర్మ ఒక్కడు సినిమాకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. చార్మినార్ సెట్ లో ఉండే న్యాచురాలిటీ చూస్తే చాలు సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా ఎంత కష్టపడ్డారో అర్ధమవుతుంది. కొండారెడ్డి బురుజు దగ్గర ఇంటర్వెల్ బ్లాక్… మహేష్ బాబు-ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్… భూమిక-ప్రకాష్ రాజ్ ట్రాక్… క్లైమాక్స్ కబడ్డీ ఫైట్… ఇలా ఒకటేంటి ఒక్కడు సినిమాలోని ప్రతి ఎలిమెంట్ హిట్ వర్త్.
మహేష్ బాబు సూపర్ స్టార్ గా మార్చిన ఒక్కడు సినిమా తమిళ్ లో విజయ్ హీరోగా గిల్లిగా రీమేక్ అయ్యింది. మహేష్ సినిమాలని ఎక్కువగా రీమేక్ చేసే విజయ్… గిల్లి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అందుకే విజయ్ ఫ్యాన్స్ కి గిల్లి చాలా స్పెషల్. గిల్లి సినిమాని విజయ్ ఫ్యాన్స్ ఇష్టపడడంలో తప్పు లేదు కానీ దాన్ని ఒక్కడు సినిమాతో కంపేర్ చేస్తూ… సోషల్ మీడియాలో ఒక్కడు సినిమా కన్నా గిల్లినే బాగుంది… మహేష్ కన్నా విజయ్ బాగా చేసాడు అంటూ ఫ్యాన్ వార్ కి దిగడం కరెక్ట్ కాదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ ఇప్పుడు తమిళ సినిమాలు vs తెలుగు సినిమాలుగా మారిపోయింది.