Site icon NTV Telugu

Pawan Kalyan: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొత్త కాదు.. 1952-67 వరకు ఒకేసారి ఎన్నికలు..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది.. దేశానికి, తమిళనాడుకు కొత్తదేమీ కాదు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన ధినేత పవన్‌ కల్యాణ్.. చెన్నైలో జరిగిన వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1952-67 వరకు దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి… వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కోరుకున్నది మాజీ సీఎం దివంగత కరుణానిధి ‌.. ఇప్పుడు వారి కూమారుడు స్డాలిన్ వద్దు అంటున్నారు అని మండిపడ్డారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగదు అన్నారు పవన్‌ కల్యాణ్.. అందుకు ఉదాహరణే గత రెండు ఎన్నికలలో ఏపీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీ గెలుస్తున్నాయి‌. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు గెలిచింది.. ఏపీలో 2014 టీడీపీ, 2019లో మరో పార్టీ గెలిచింది.. గత ఎన్నికలలో కూటమీ ప్రభుత్వం ఎంపీ, అసెంబ్లీలో ఎన్నికలలో గెలిచింది.. ఆ గెలుపు ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి‌ అని గుర్తుచేశారు.. ఒడిస్సా, తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి… అక్కడ బీజేపీ లబ్ధి పొందలేదు‌.. ఆశించినంత గెలవలేదు కదా..? అని ప్రశ్నించారు. కానీ, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని డీఎంకే చెప్పడం విడ్డురంగా ఉందన్నారు..

Read Also: Jagadish Reddy: తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలి..

ఇక, వన్ నేషన్ ,వన్ ఎలక్షన్ పై కరుణానిధి పుస్తకంలో రాశారు… డీఎంకే అధినేత స్టాలిన్ ఒకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పునరాలోచించుకోవాలని సూచించారు.. నేను దక్షిణాదినేతనే… నేను ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు నే… అంతిమంగా ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఆ దిశగానే ఆలోచించాలి.. వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించకూడదు.. ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కరుణానిధి కళ… ఆయన డ్రీమ్ అది… దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోటా ఎన్నికల జరగడం వల్ల ఇబ్బందులు పడాల్సివస్తోంది… దానివల్ల డబ్బులు, టైం, అభివృద్ధి పై ఎఫెక్ట్‌ పడుతుంది.. వాటి అన్నిటికి చెక్ పెట్టడానికే వన్ నేషన్, వన్ ఎలక్షన్.. ఎప్పుడు ఎలక్షన్లో ఉండడంవల్ల అధికారులు నేతలు దానిపైనే దృష్టి పెడుతున్నారు… దానివల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు..

Exit mobile version