విశాఖపట్నంలో జనసేన నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని తెలిపారు పవన్ కళ్యాణ్. ఐదు నెలల క్రితమే జనవాణి కార్యక్రమం నిర్ణయం చేసాము. విశాఖ గర్జన కు పోటీగా మేము పెట్టలేదు వారి కార్యక్రమం భగ్నం చేసే ఉద్దేశ్యం మాకు లేదు. మేము ఏం చెయ్యాలో వైసీపీ నేతలు చెబుతారా? మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా? అన్నారు. జనవాణి జనం గొంతుక. సమస్యలు ప్రభుత్వం పరిష్కారిస్తే మా దగ్గర కు ఎందుకు వస్తారు. 3000 కు పైగా జనవాణి కార్యక్రమానికి పిటిషన్లు వచ్చాయి. వాటికి సంబంధించి ఆయా శాఖలకు తెలిపాం అన్నారు పవన్ కళ్యాణ్.
మా తండ్రి పోలీస్ కానిస్టేబుల్. అందుకే పోలీసులు అంటే నాకు గౌరవం. నిన్న ఓ పోలీస్ అధికారి వాహనం ఎక్కి అభివాదం వద్దంటున్నారు అది చాలా బాధ అనిపించింది. నిన్న వైసీపీ ప్రభుత్వనికి పోలీసులు కొమ్ముకాసారు. మీ మీద నమ్మకం లేదన్న నాయకుడు ఈ రోజు సీఎం. మీరు అంతా పవర్ పుల్ అయితే వివేకానంద హత్య కేసు లో ఎందుకు చేధించలేకపోయారు. ఎందుకు నిందితులను అరెస్టు చెయ్యలేదు. గంజాయి వ్యాపారం చేసే వారిని దోపీడీలు చేసేవారిని వదిలేస్తారు. ప్రజలు సమస్యలు గొంతెత్తే గొంతు నొక్కుతున్నారు. రాజధాని పై మా నిర్ణయం చెప్పాం.
Read ALso:PM Narendra Modi: ప్రధాని చేతుల మీదుగా డీబీయూల ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోదీ
2014లోనే రాజధాని విశాఖ,కర్నూలు,అమరావతి అని ఎందుకు చెప్పలేదు. అప్పుడు చెబితే మేము అదే రాజధాని అని చెప్పే వాళ్ళం. రాయలసీమ నుండి సీఎంలుగా ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేసారు మరి అభివృద్ధి ఎందుకు చెయ్యలేదు? మీరు చిలకపలుకులు బూతులు తిట్టడానికి రాజధాని వికేంద్రీకరణ కావాలి. ఉత్తరాంధ్ర నుండి అనేక నాయకులు ఉన్నారు మరి ఏంచేసారు. ఒక వ్యక్తి తీసుకున్నా నిర్ణయం వల్ల అనేక పరిశ్రమలు వెళ్లపోయాయి. వాటాల లేవని ఇలా చేసారా? ఒక్క వ్యక్తి చేతుల్లో అధికారం ఉంచుకోని మీరు వికేంద్రీకరణ గురించి మాట్లాడతారా ?
వారికి అధికారం ఇవ్వడం పేరుకే మంత్రులు. నిన్న ఊహించలేదు అంత మంది వస్తారని. ప్రజల నుండి గర్జన రావాలి కడుపు కాలినవాడు గర్జిస్తాడు. మీరు చేసిన గర్జన ఏంటో నిన్ననే తెలిసింది. మేము పోలీసులు తో గొడవ పెట్టుకోవడం ఘర్షణ చేయ్యడం మాకు చేతకాక కాదు. నిన్న పోలీసులు గొడవ పెట్టుకోవాలంటు నన్ను రెచ్చగొట్టారు. కాని నాకు పోలీసులు అంటే గౌరవం ఉంది. అభివాదానికి ప్రతి వాదం చేస్తే 100 మందిని తీసుకెళ్లారు. సంబంధం లేని వ్యక్తులపై హత్యయత్నం కేసు నమోదు చేసారు.రెచ్చగొట్టడానికి నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.
కాని ప్రజాస్వామ్యంలో ఉన్నాం దానికి గౌరవం ఇవ్వాలి. వైసీపీ గుండా గాళ్ళుకు ఒక్కటే చెబుతున్నా మీ ఉడత ఉపులకు భయపడను. 70 లక్షలు ఈ రోజు పంపణీ చెయ్యాలి. జనవాణి వినతులు తీసుకోవాలి. కాని మా వాళ్ళను విడిచిపెట్టేంత వరకు జనవాణి నిర్వహించం. వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తానన్నారు. విశాఖ ప్రశాంత నగరం అలాంటి చోట గొడవలు చూస్తే బాధగా ఉందన్నారు. నేను మూడు సార్లు పెళ్ళి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా విడాకులిచ్చి.. పెళ్లిళ్లు చేసుకోండి అన్నారు పవన్.
Read ALso: Geeta Singh: అవకాశాలు వస్తే చేస్తా.. సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ..