NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌కు గోడు వెళ్లబోసుకున్న రైతులు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.. మీరు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని పవన్ కి తెలిపారు రైతులు.. ఇంకా కోతలు కోయాల్సి వుందని, గోనె సంచులు ఇవ్వడంలేదు గోడు వెళ్లబోసుకున్నారు.. నూక , ట్రాన్స్ పోర్ట్ పేరుతో రైతులని మిల్లర్లు దొచేస్తున్నరని పవన్‌ కల్యాణ్ ముందు కన్నీరుమున్నీరయ్యారు.. ఐనకాడికి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడిన పవన్.. రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.. అకాల వర్షాల వల్ల కలిగి పంట నష్టంతో పాటు.. ధాన్యం కొనుగోళ్లలో ఎదుర్కొంటున్నర సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు రైతులు..

Read Also: Kiccha Sudeep: బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకికాదు..

ఇక, అంతుకుముందు రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికాయి జనసేన శ్రేణులు.. అక్కడి నుంచి రాజమండ్రి నగరం – బొమ్మూరు – రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవ భూములలో దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులను మాట్లాడారు పవన్‌.. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు.. తదుపరి పి. గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్లి.. రైతులతో మాట్లాడతారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.