Site icon NTV Telugu

Pawan Kalyan: గూస్బంప్స్ తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్ వీడియో

Pawan

Pawan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్లో భాగంగా పవన్ ఇష్ట పూర్వకంగా పోటీ చేస్తున్నట్లు ప్రమాణం చేశారు. ఈ వీడియే ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది. పవన్ అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీడియో చూస్తే నామినేషన్ ర్యాలీకి పెద్ధ సంఖ్యలో అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది.

READ MORE: Rain: ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వర్షం

ఇంతకీ ఆయన ఏమని ప్రమాణం చేశారంటే.. “కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను.. పిఠాపురం శాసనసభ సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాను. భగవంతునిపై ప్రమాణం చేసి ఇష్ట పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని..దాని సమైఖ్యత సార్వ భౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను.” అనంతరం సాయంత్రం నిర్వహించే ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లోని బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.

Exit mobile version