Pawan Kalyan: సొంత ఇంటికి దారి వేయించుకోలేని వ్యక్తి ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే వాసు బాబు అని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. పేకాట నడపడం ద్వారా ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆరోపించారు. పేకాటలో క్లబ్బులు నడిపే వాళ్ళు కావాలా.. డీఎస్సీ ఇచ్చే వాళ్ళు కావాలా అంటూ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. స్కూల్ బుక్స్‌పై దేశ నాయకుల ఫోటోలో ఉంటే బాగుంటుంది.. జగన్ ఫోటో ఉంటే దరిద్రంగా ఉంటుందని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నుంచి బెయిల్ మీదున్న వ్యక్తి జగన్.. సీఎం స్థానంలో ఉండేవాడు సరైన వాడా కాదా అనేది ఆలోచించాలన్నారు. ఎవ్వరితో గొడవలు పెట్టుకోకుండా , ఎవ్వరితో అనిపించుకోకుండా సినిమాలు చేసుకోవచ్చు.. కానీ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే వాడినన్నారు.
Read Also: Botsa Satyanarayana: ఐదేళ్ల పాలన చూసి మళ్లీ గెలిపించమని అడుగుతున్నాం..
ఆక్వా చెరువుల వల్ల ఉంగుటూరులో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. టీచర్లను జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. సీపీఎస్ రద్దు చేయకపోవడం వల్ల టీచర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ స్వార్థం లేకుండా పని చేసే జన సైనికులు ఉన్నారని.. జనసేనకి ఓటు వేస్తే వేళ్లు కత్తిరిస్తామని అంటున్నారని.. చూస్తూ వూరుకునే వాళ్ళు లేరన్నారు. అరటిపండు తిని తొక్క ముఖాన పడేశారని.. అందుకే ఇది తొక్కలో ప్రభుత్వం అయ్యిందని ఎద్దేవా చేశారు. దేవుడి భూములు చెరువులు తవ్వుకుని వచ్చిన డబ్బులు కనీసం ఆలయాలకు కట్టడం లేదని విమర్శలు గుప్పించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం జనసేన ప్రధాన లక్ష్యమని.. కొల్లేరు పరిరక్షణ కోసం జనసేన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
Read Also: CM YS Jagan: ప్రచారంలో వైసీపీ దూకుడు.. సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతున్నారు కానీ మంచి నీరు ఇవ్వడం లేదన్నారు. ఆక్వా రంగాన్ని ముంచేసిన ప్రభుత్వం వైసీపీదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు పెంచేశారు.. సబ్సిడిల్లో వచ్చే అనేక పథకాలు ఆపేసారని మండిపడ్డారు. ఆక్వా కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యాయన్నారు. పోలవరం పూర్తి అయితే తాగునీటి సమస్యలు తీరతాయన్నారు. వర్షాలు పడితే రహదారులు స్విమ్మింగ్ పూల్స్‌గా మారిపోతున్నాయన్నారు. జగన్‌కు విరామం ప్రకటించడం చాలా అవసరమని.. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్టు వైసీపీకి విరామం ప్రకటించాలన్నారు.