జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. దూరం నుంచే కొండను పరిశీలించిన పవన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, రుషికొండ నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసారు. తట్టెడు మట్టి తీస్తేనే పర్యావరణ ఇబ్బందులు వచ్చే చోట విధ్వంసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే అయితే సర్క్యూట్ హౌస్, ఇతర చోట్ల కట్టవొచ్చు కదా అని జనసేనాని ప్రశ్నించారు. సీఎం జగన్ కు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలని పవన్ అన్నారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ నిర్మిస్తాడ అని పవన్ తెలిపారు.
Newsclick Case: న్యూస్‌క్లిక్‌పై చర్యలు తీసుకోవాలి.. రాష్ర్టపతి, సీజేఐలకు ప్రముఖుల లేఖలు
మరోవైపు ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రుషికొండపై నిర్మాణాలకు అన్ని అనుమతులు వచ్చాయా అని ప్రశ్నించారు. తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుందని.. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయని పవన్ అన్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణను కూడా ఇలాగే దోచేశారని.. జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని పవన్ నిలదీశారు.
Milk Price Hike: మండుతున్న నిత్యావసరాల ధరలు.. ఏడాదిలో 10శాతం పెరిగిన పాలు
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ దోచేసాడని.. ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల భూములను ప్రజల దగ్గర లాకుంటున్నారని ఆరోపించారు. చట్టాలు కాపాడివలసిన ముఖ్యమంత్రి చట్టాలను ఉల్లంగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ నిర్మాణం అంతా పుర్తిగా వైలేషన్ చేసి కట్టారని.. ఇక్కడ శాంతి యుతంగా ఉన్న ప్రజల పై దోపిడీ చేస్తున్నారని.. జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
