Pawan Kalyan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. కొన్నిసార్లు ఇది తారాస్థాయికి చేరుకుంది.. తాజాగా, తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు.. మరోసారి వైసీపీ, బీఆర్ఎస్ గా మారిపోయింది.. తెలంగాణ మంత్రులు ఏపీ మంత్రులను టార్గెట్ చేయడం.. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, వైసీపీ నేతలు.. తెలంగాణ మంత్రులను టార్గెట్ చేయడం.. అంతే కాదు.. అదికాస్తా రెండు ప్రాంతాల ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా మారిపోయాయి.. అయితే, ఈ పరస్పర ఆరోపణలు, విమర్శలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
వైసీపీ నేతలు, మంత్రులు తెలంగాణ ప్రజలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవుపలికారు పవన్ కల్యాణ్.. నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ మంత్రి ఒకరు (హరీష్ రావు) ఏపీకి సంబంధించిన కామెంట్లు చేశారు.. కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం అభ్యంతరకరం అన్నారు. ఒక జాతిని అవమానిస్తుంటే వైసీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు ? అని మండిపడ్డారు.. మొన్నటి వరకు తెలంగాణలో కేబుల్ వ్యాపారం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వారు ఈ విషయం మీద ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. నేను ఆది నుంచి చెబుతున్నాను.. ఎప్పుడైనా ప్రజలు, పాలకులు వేరు.. కానీ, ఇలాంటి వివాదాల్లోకి ప్రజలను, జాతిని లాగడం సరికాదన్నారు.. ఎవరైనా కామెంట్లు చేస్తే.. వ్యక్తిగతం చేసుకునేది ఉంటే చేసుకొండి.. కానీ, ప్రజలను మాత్రం లాగొద్దు అని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్.
తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023
