Pawan Kalyan: తెలంగాణ అంటే నా రోమాలు నిక్క పొడుచుకు వస్తున్నాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తెలంగాణ అంటే నా రోమాలు నిక్క పొడుచుకువస్తున్నాయ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దశాబ్దాలు తెలంగాణ కోసం పోరాడుతాను అన్నారు. జన్మ నిచ్చిన తెలంగాణ జై తెలంగాణ అన్నారు పవన్. తను తెలంగాణలో మాట్లాడే అవసరం వచ్చింది. పోరాట స్ఫూర్తి నీ ఇచ్చిన తెలంగాణ… అణగారిన తెలంగాణ కోసం తను అండగా వుంటానని.. వెనకడుగు ఎప్పుడు వేయనని అన్నారు. తెలంగాణలో వున్న పోరాట స్ఫూర్తి.. దేశమంతా వుంటే అవినీతి ఎప్పుడో వెళ్ళిపోయేదని అన్నారు. మీకు వెన్నంటి నిలబడే పార్టీలు తెలంగాణలో కావాలన్నారు. బీజేపీ పరిపాలన జరుగుతున్న రాష్ట్రాల్లో బీసీలకు ప్రాధాన్యత ఉందన్నారు. గద్దరన్నకు చెప్పిన మాటకు తను నిలబడుతానని.. గద్దర్ ఆత్మ శాంతిగా వుండాలంటే ఆయన ఆశయాలను సాధించాలని గుర్తుచేసుకున్నారు. నిధులు నీళ్లు నియామకాలు కోసం పోరాటం చేశారని అన్నారు. తన మద్దతు నిర్ణయం నరేంద్ర మోడీ కి వుంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మీద గౌరవం, కేటీఆర్ మీద నమ్మకం వుందన్నారు. అయితే బీజేపీ వల్లనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే ఎన్నికలు రావాలని.. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుందని కోరారు.
ఆంధ్రాలో గుండాల్ని రౌడీల్ని ఎదుర్కొని ఉన్నానంటే అది తెలంగాణ స్ఫూర్తి మాత్రమే అన్నారు.
Read also: Harish Rao: జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో పడ్డాడు.. ఐదేళ్లలో ఒక్క ఊరు కూడా తిరగలేదు
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తను లేకపోయినా తెలంగాణలో జనసేన వుంది అంటే ఇక్కడి కార్యకర్తల కృషి నాది మానవత్వం అన్నారు. సనాతన ధర్మం సోషలిజం రెండు ఓకే.. దానిలో వుండే విధంగా చేసిన దాశరథి నాకు స్ఫూర్తి అన్నారు. సనాతన ధర్మం సోషలిజం రెండింటినీ నేను నడిపిస్తా అన్నారు. మనస్పూర్తిగా బీజేపీకి మద్దతు జనసైనికులు ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ నీ ఎందుకు తిట్టలేదు అంటే ఆంధ్ర లో మాదిరిగా బాగా తిరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1200 మంది తెలంగాణలో బలి దానాలు జరిగాయన్నారు. ప్రతి చోట జన సేనకు బలం వుందన్నారు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో పలు పార్టీలు కష్టపడ్డాయన్నారు. దశాబ్దం తరువాత ఇక్కడ రంగంలోకి వచ్చానని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తి తోనే ఆంధ్ర లో పోరాటం చేస్తున్నానని అన్నారు. పేపర్ లీక్ లు వల్ల నిరుద్యోగులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004 నుంచి అవినీతి పెరిగిందని మండిపడ్డారు. జలయజ్ఞంలో దోపిడీ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే అవినీతి పోతుందని భావించామన్నారు. గత పాలకులు చేసిన తప్పే మళ్ళీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. లెఫ్ట్ మిత్రులతో మాట్లాడుతూ వుంటానని అన్నారు. లెఫ్ట్ పద్దతిలోనే తను.. జనసేన పని చేస్తుందని అన్నారు. కౌలు రైతులకు ఏపిలో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కూడా కౌల్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు.
Harish Rao: జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో పడ్డాడు.. ఐదేళ్లలో ఒక్క ఊరు కూడా తిరగలేదు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..