NTV Telugu Site icon

Pawan Kalyan: అందాల సీమను కలహాల సీమగా మార్చాడు.. జగన్ పై కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల సీమను కలహాల సీమగా మార్చాడని దుయ్యబట్టారు. మళ్లీ ఈ పరిస్థితులు రాకుండా కాపాడుతామని పవన్ తెలిపారు. జగన్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆరోపించారు. మళ్లీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయండని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.

Twins Same Marks: 10, 12 తరగతుల్లో సమాన మార్కులు సాధించిన కవలలు.. ఎక్కడంటే..?

రైతులు కన్నీటిని తుడిచే కూటమి వస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకే ఎన్డీయే కూటమి ఏర్పడిందన్నారు. త్రివేణి సంగమంలా టీడీపీ, బీజేపీ, జనసేన పనిచేస్తాయని పవన్ కల్యాణ్ చెప్పారు. కొబ్బరి, వరి పండించే రైతులకు అండగా ఉంటామని అన్నారు. కోనసీమ రైతులకు అండగా ఉంటామని.. గంగ బొండం కొబ్బరి మొక్కలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు.

MP Ranjith Reddy : రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్‌ రెడ్డి.. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు

జగన్ పెట్టుకున్న మాఫియా డాన్లను తన్ని తరిమే వరకు పోరాడుతామని పవన్ కల్యాణ్ తెలిపారు. మహిళలు కన్నీళ్లు తుడుచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. కోనసీమకు కొబ్బరి అధారిత పరిశ్రమలు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తామని.. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ఉపాధి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాని తెలిపారు.

కలహాల సీమ కాదు.. ప్రేమ సీమ | Pawan Kalyan Speech @ P.Gannavaram | NTV